ప్రతి ఒక్కరూ చంద్రన్న బీమా చేయించుకోవాలి

నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి కోవూరులోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రన్న బీమా ప్రవేశపెట్టి ఆపద సమయంలో ఎందరికో చేయూతనిచ్చిందన్నారు. ఈ పథకాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చంద్రన్న బీమా చేయించుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్