ఉదయగిరి సర్కిల్ సిఐ వెంకట్రావు ఆలయాల నిర్వహణపై బుధవారం సూచనలు చేశారు. ఉదయగిరి సర్కిల్ పరిధిలోని వరికుంటపాడు, సీతారాంపురం, దుత్తలూరు మండలాల్లోని ఆయా గ్రామాల పరిధిలోని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వాచ్మెన్ ను నియమించాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు చోటు చేసుకున్నట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఆలయాలపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు.