కలిగిరిలో వైసిపి భారీ భైక్ ర్యాలీ

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవరెడ్డి సమక్షంలో ఈ ర్యాలీ నిర్వహించారు. వందలాది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బైకులు, కార్లకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు జెండాలు కట్టుకొని మేకపాటికి మద్దతుగా జై కొట్టారు.

సంబంధిత పోస్ట్