ఆహుడా ఛైర్మన్ గా నియమితులైన వరుణ్ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోదకుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలోని వారి ఛాంబర్ లో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. కార్యక్రమంలో వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అంకె ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.