ఉరవకొండ వైద్య సేవల్లో లోపం.. రోగుల పాలిట శాపం

ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు సిబ్బంది పని వేళలు పాటించటంలేదు. శుక్రవారం 11 గంటలైనప్పటికీ డాక్టర్లు విధులకు హాజరు కాలేదు. దీంతో రోగులు వైద్య పరీక్షల కోసం గంటలు తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. పేరుకే 50 పడకల ఆసుపత్రి. ఇక్కడ వైద్య చికిత్సలు మాత్రం నామ మాత్రమే. ప్రతి చిన్న, చితక వైద్యానికి జిల్లా కేంద్రానికి వైద్యులు రెఫర్ చేస్తూ చేతులు దులుపుకోవడం ఇక్కడ పరిపాటే అయింది.

సంబంధిత పోస్ట్