AP: ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ హెచ్చరించింది. అధిక ఫీజులు వసూలు చేసినా, విద్యార్థులకు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఇవ్వకపోయినా రూ.15 లక్షలు ఫైన్ విధించడంతో పాటు, స్కూల్ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. ఏమైనా సమస్యలుంటే 8712627318, 08645274445 నంబర్లకు విద్యార్థులు ఫిర్యాదు చేయాలని సూచించింది.