AP: తన భర్తపై వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటానని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య సుజన ఆవేదనతో చెప్పారు. తాడేపల్లిలో సుజన మాట్లాడుతూ.. తన భర్తపై ఇప్పటివరకూ 15 కేసులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని తెలిపారు. అసలు ఆయన చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. ఆగస్టు 31న తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని రెండున్నర నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారని మండిపడ్డారు.