నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తుందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం చిత్తూరులో తెలిపారు. దొంగతనాలు, హత్యలు, దోపిడీలు నేరాల నియంత్రణకు, నేరాల చేధనకు సిసి కెమెరా ఫుటేజ్ సహకరిస్తుందన్నారు. జిల్లాలోని వ్యాపారస్తులు, దుకాణాదారులు, ఇంటి యజమానులు సాధ్యమైనన్ని కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా హైవేలో జరిగే రోడ్డు ప్రమాదాలు, నేరాల గుర్తింపునకు సీసీ కెమెరాలు సహకరిస్తాయన్నారు.