చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో వరి సాగుచేసిన రైతుకు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కోత దశకు చేరుకున్న వరి పైరు గత నాలుగు రోజుల నుంచి అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలకు నేలపాలైంది. పొలాల్లో నీరు ఉండడం వల్ల నేలపై పడిన వరి పైరు అంతా కూడా మొలక వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని బాధిత రైతులు వాపోయారు.