క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కె. ఎస్. విశ్వనాథన్, ఐనాతయ్యపాలెం నుంచి చుక్కవానిపాలెం వరకు సంస్థ ప్రతిపాదిత 100 అడుగుల రహదారిని, వీకేపీసీపీఐఆర్-యుద్ధప్రాతిపదిత జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ నుంచి అచ్యుతాపురం 200 అడుగుల రహదారిని గురువారం పరిశీలించారు. అచ్యుతాపురం జంక్షన్ అభివృద్ధి పనులపై చర్చించారు.