ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కసింకోట సీఐ అల్లుస్వామి నాయుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం కసింకోట మండలంలోని బయ్యవరం జాతీయ రహదారిలో వాహనాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాలను ఆపి హెల్మెట్లు, సీట్ బెల్ట్ లు ధరించాలని వాహనదారులకు చెప్పారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలకు గురవుతారని, కుటుంబంలో సభ్యులు కోల్పోతారని వాహనదారులకు చెప్పారు.