ఏపీలోని కోనసీమ జిల్లా అయినవిల్లిలో దళిత యువకుడు, వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌కు బెయిల్ లభించింది. శ్రీకాంత్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అమలాపురం జడ్జి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్ 6న శ్రీకాంత్ హత్య చేయించినట్టు తెలిసింది.