పాఠశాలల్లో ఎక్కడా ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ‘ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత దెబ్బతినకూడదు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నింటికీ వాలంటీర్లను తీసుకోండి. పాఠశాలల్లో విజ్ఞాన, విహార యాత్రలు, క్రీడలు నిర్వహించాలి. పిల్లలు ఒత్తిడి లేకుండా ఆనందంగా చదువుకునే పరిస్థితి రావాలి’ అని సీఎం సూచించారు. విద్యార్థులకు శాశ్వత అకడమిక్ నంబరు ఇవ్వాలన్నారు.