యూపీలోని కాన్పూర్ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఓ మహిళా ప్రాణాలను కాపాడి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. సోమవారం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో కదిలే రైలులో నుంచి ఓ మహిళా అదుపుతప్పి కిందపడిపోయింది. అది గమనించిన కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడాడు. ఇదంతా స్టేషన్‌లోనే సీసీ కెమెరాలో రికార్డ్ కాగా సదరు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.