సైబర్ నేరాలను అరికట్టేందుకు 5,000 మంది సైబర్ కమాండోలు

సైబర్ నేరాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీసుల్ని సైబర్ కమాండోలుగా తీర్చదిద్దనున్నారు. వచ్చే ఐదేళ్లలో సుమారు 5,000 మందిని రంగంలోకి దించాలని కేంద్ర హోంశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ బాధ్యతను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ)కి అప్పగించింది. ఈ క్రమంలోనే తొలి విడతగా 346 మందిని ఎంపిక చేసింది. ముందుగా రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర పోలీస్ సంస్థలు, కేంద్ర పారామిలిటరీ బలగాల నుంచి 2023 అక్టోబరు 5న నామినేషన్లను ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్