తమిళనాడులో జోరుగా జల్లికట్టు పోటీలు

తమిళనాడులో జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. తమిళనాడు సంస్కృతీసంప్రదాయాల్లో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టుకు అంత విశిష్ట స్థానం ఉంది. మధురై జిల్లా అవనియపురంలో జరిగే జల్లికట్టు పోటీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అవనియపురంలో జరిగే జల్లికట్టు పోటీల కోసం 1,100 ఎద్దులను సిద్ధం చేశారు. బాగా మదించిన ఆ ఎద్దుల కొమ్ములు వంచేందుకు 900 మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.

సంబంధిత పోస్ట్