వర్ని మండలంలోని జాకోర గ్రామంలో ప్రజలు కనుమ పండుగను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. కనుమ పండుగ సందర్భంగా మహిళలు, చిన్నారులు ఇండ్ల ముందు ముగ్గులు వేశారు. పిండి వంటకాలు తయారు చేసుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కలిసి ఆరగించారు. చిన్నారులు గాలి పటాలను ఎగరవేస్తూ ఆనందంగా గడిపారు.