రాంపూర్ ఆంజనేయ ఆలయంలో జలాభిషేకం

పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని హనుమాన్ మందిరంలో శుక్రవారం ఆంజనేయ స్వామి విగ్రహనికి గ్రామ పెద్దలు, ప్రజలు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రతి ఏడాది హనుమాన్ ఆలయంలో నీళ్లను నింపడం జరుగుతుందని అన్నారు. అనంతరం గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి వెంకటేశ్వర స్వామి విగ్రహంకు జలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్