మధిర: కృష్ణాపురం జూనియర్ కళాశాల వద్ద ఉద్రిక్తత

మధిర మండలం కృష్ణాపురం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు. విద్యార్థి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మస్తాన్, రామకృష్ణ డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్