మధిర మండలం కృష్ణాపురం గురుకుల కాలేజీలో నిన్న ఇంటర్ విద్యార్థి సాయి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సీఐ మధు విద్యార్థి సూసైడ్ లెటర్ ను చదివారు. అందులో నీ అంత బ్యూటిఫుల్ పర్సన్ నా లైఫ్ లో ఎవరూ లేరు. మా అమ్మ బంగారం తీసుకురమ్మన్నది. ఆ బంగారంలా నిన్ను తీసుకెళతా అని రాసినట్లు ఉంది. ఆ లెటర్ చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.