HYD: బుద్ధభవన్ లో హైడ్రా ప్రజావాణిని కమిషనర్ రంగనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ క్రమంలో హైడ్రా ప్రజావాణికి ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. బాధితుల నుంచి కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ప్రజల ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులను కమిషనర్ అదేశించారు. సాయంత్రం 6గంటల వరకు ఈ ప్రజావాణి కొనసాగింది.