ముదిగొండ నుంచి న్యూ లక్ష్మీపురం, సువర్ణాపురం వరకు అసంపూర్తిగా ఉన్న ప్రధాన రహదారిని పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం ముదిగొండలో ప్లేకార్డులు, ఎర్రజెండాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. గత ఆరు నెలల క్రితం కాంట్రాక్టర్ రోడ్డును తవ్వి కంకర, డస్ట్ పోసి పట్టించుకోకపోవడంతో వాహనదారులు, మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే రోడ్డును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.