ముగిసిన చెరువుమాధారం వివాదం

నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారంలో ఇటీవల చెలరేగిన వివాదం తారస్థాయికి చేరగా, పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఓ యూట్యూబర్ అనుచితంగా మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఇదే విషయమై ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్ ఇరువర్గాలతో గురువారం సమావేశమై కౌన్సెలింగ్ ఇచ్చారు. అందరూ సహకరించాలన్న సూచనకు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగినట్లయింది.

సంబంధిత పోస్ట్