తిరుమలాయపాలెం: పిడుగుపాటుతో అస్వస్థతకు గురైన మహిళ మృతి

తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడుతండాలో పిడుగుపడి ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ భూక్య శారద అనే మహిళ ఆదివారం మృతి చెందింది. బాధితులను మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా శారద అనే మహిళకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో శారద మృతి చెందింది. మృతురాలికి భర్త శంకర్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్