తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గం అంటే తనకు ప్రేమ, ఇష్టం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కాకర్లపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మంత్రి తుమ్మల ప్రసంగించారు. తాను జిల్లాలో ఏ నియోజకవర్గంలో నుంచి ప్రాతినిధ్యం వహించినా సత్తుపల్లి అంటే తనకు ఎంతో ఇష్టమని, సత్తుపల్లి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటమే తన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.