కల్లూరు: ఇంకా లభించని విద్యార్థి ఆచూకీ

కల్లూరు మండలంలోని పడమర లోకారానికి చెందిన విద్యార్థి పరిమి శివ ఆచూకీ సోమవారం సాయంత్రం వరకు కూడా సాగర్ కాల్వలో లభించలేదు. సెల్ఫీ తీసుకునే క్రమాన ఆదివారం ఆయన ప్రమాదవశాత్తు కాల్వలో పడి కొట్టుకుపోయిన విషయం విదితమే. ఈమేరకు ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం పొద్దుపోయే వరకు పడమర లోకారం నుండి కప్పలబంధం మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈతగాళ్లతో గాలింపు చేపట్టినా ఫలితం కానరాలేదు.

సంబంధిత పోస్ట్