గర్భిణిలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని డిఎంహెచ్ఓ డా. కళావతిబాయి అన్నారు. గురువారం సత్తుపల్లి ఆసుపత్రి, గంగారంలోని పీహెచ్సీలను ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, స్టాక్ ను పరిశీలించారు. వైద్యారోగ్య సిబ్బంది తమ ఆరోగ్యంతో పాటు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధుల్లో సమయపాలన పాటిస్తూ రోగాలపై అవగాహన కల్పించాలని సూచించారు.