ఖమ్మం, వైరా, సింగరేణి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన 757 కిలోల గంజాయిని తల్లాడ మండలం గోపాల్ పేట గ్రామంలో ప్రభుత్వ ఆమోదిత ఎడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ లో బుధవారం దహనం చేశారు. డిస్పోజబుల్ అధికారి ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. 1. 89 కోట్ల విలువ చేసే గంజాయిని దహనం చేశారు. అసిస్టెంట్ కమిషనర్ జి. గణేశ్, నాగేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.