సత్తుపల్లిలో ప్రారంభమైన 6వ భక్త సమ్మేళనం

రామకృష్ణ వివేకానంద భావప్రచార పరిషత్ 6వ భక్త సమ్మేళనం శనివారం సత్తుపల్లిలో ప్రారంభమైంది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి మాధురి ఫంక్షన్ హాల్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మట్టా రాగమయి హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదట పతాకావిష్కరణ జరిపిన అనంతరం స్వామీజీ, మాతాజీల చిత్రపటాల వద్ద నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్