సింగరేణి: మంత్రి పొంగులేటిని కలిసిన పెద్దమ్మ గుడి కమిటీ సభ్యులు

సింగరేణి మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి గుడి ధూప దీప నైవేద్యాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. స్పందించిన మంత్రి ప్రభుత్వం నుండి సాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ తురక నారాయణ, తురక రాంబాబు, కాంగ్రెస్ జిల్లా నాయకులు తిరుపతిరావు, మల్లెల నాగేశ్వరరావు,  శ్రీను పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్