బెల్లంపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేయాలి

బెల్లంపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సైన్యం జాతీయ ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక బస్టాండ్ ను డిపోగా మార్చాలని, కాంటా చౌరస్తా వద్ద బస్టాండ్ నిర్మించాలని కోరారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై ఫుట్ పాత్ లను అక్రమించి చేపడుతున్న వ్యాపారాలను నిలువరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్