నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) తదుపరి సెక్రటరీ జనరల్‌గా నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రూట్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2024, అక్టోబరు 1న మార్క్ రూట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ గా నార్వేకు చెందిన జెన్స్ స్టోల్టెన్ బర్గ్ ఉన్నారు. రొమేనియా అధ్యక్షుడు క్లాస్ ఐహాన్నిస్ ఈ పోటీ నుంచి విరమించుకున్నారు. నాటో తొలి సెక్రటరీ జనరల్ లార్డ్ ఇస్మాయ్ బాధ్యతలు చేపట్టారు.