కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలు ఆపాలి: బిఎస్పి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పై కపట నాటకాలు ఆపాలని రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని చేగుంట మండల బిఎస్పి అధ్యక్షుడు తప్ప బాను చందర్ అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనకపోతే ఈ ప్రభుత్వాలు ఉండి ఎందుకని రైతు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం మనుగడ సాధించలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయంగా సమాధి కట్టే రోజు దగ్గరలో ఉన్నాయని తెరాస, బిజెపి వైఖరి ఎలా ఉందంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ లా ఉంది అని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ధర్నాలు వారి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్