రైలులో మంటలు.. గద్వాల స్టేషన్‌లో నిలిపివేత

64చూసినవారు
రైలులో మంటలు.. గద్వాల స్టేషన్‌లో నిలిపివేత
TG: కాచిగూడ నుంచి చెన్నైకి బయలుదేరిన ఎగ్మోర్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఎక్స్‌ప్రెస్ రైలులోని 8 నెంబర్‌ ఏసీ బోగిలో పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కేకలు వేశారు. గద్వాల రైల్వేస్టేషన్‌లో రైలును అధికారులు నిలిపివేశారు. ప్రయాణికులను బోగీల నుంచి కిందకు దింపారు. అసలు రైలులో పొగలు రావడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అధికారులు ఘటనపై విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్