రోజూ కొంత దూరం వేగంగా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేగంగా నడిచే వారికి గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం క్యాన్సర్ వంటి తదితర పెద్ద పెద్ద సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని 25 వేల మందిపై జపాన్‌లోని దోషిషా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. వేగంగా నడవటం వల్ల ఏరోబిక్ ఆక్టివిటీ పెరుగుతుంది. బీపీ, కొలెస్ట్రాల్ సైతం నియంత్రణలో ఉంటాయి. వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది.