మనోహరాబాద్ మండలం కుచారం జైత్రం తాండ కి చెందిన వివిధ పార్టీలకు చెందిన 30 మంది కార్యకర్తలు మంగళవారం బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి లో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, శేఖర్ నాయక్ ప్రజా ప్రతినిధులు బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.