స్వశక్తితో ఎదిగిన 100 మంది అత్యంత సంపన్న అమెరికన్ మహిళల్లో నలుగురు భారీతీయులకు చోటు దక్కింది. వీరిలో అరిస్టా నెట్వర్క్ అధ్యక్షురాలు, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ (2.4 బిలియన్ డాలర్లు), ఐటీ కన్సెల్టింగ్-ఔట్ సోర్సింగ్ సంస్థ సింటే సహవ్యవస్థాపకురాలు నీర్జా సేథీ (990 మిలియన్ డాలర్లు), క్లౌడ్ కంపెనీ కన్ఫ్లూయెంట్ సహవ్యవస్థాపకురాలు నేహా నర్ఖెడే (520 మిలియన్ డాలర్లు), పెక్సీకో సీఈఓ ఇంద్రా నూయి (350 మిలియన్ డాలర్లు) ఉన్నారు. ఈ విషయాన్ని ఫోర్బ్స్ తన 9వ వార్షిక జాబితాలో పేర్కొంది.