మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో శివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. పండుగ సందర్భంగా ప్రత్యేక అలంకరణతో అభిషేకాలు జరిగాయి. దేవాలయానికి ఉదయంనుండే భక్తులు అధికసంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుదర్శనం కిషోర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.