దివంగత రతన్ టాటా దేశానికి ఎంతో సేవ చేశాడని ఆయనకు భారతరత్న ఇవ్వాలని మిర్యాలగూడ బీఆర్ఎస్ 17 వ వార్డు ఇంఛార్జి ఘంట శ్రవణ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనేక సంస్థలు, కంపెనీలు పెట్టి ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజ సేవ కోసం అనేక మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాడన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి రతన్ టాటాకు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు.