నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ సమయంలో హైదరాబాద్ కు కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకం పనుల్లో పెను ప్రమాదం తప్పింది. సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు నిర్మించిన కాంక్రీట్ గోడ కూలడంతో పంపుహౌస్ నీట మునిగింది. ఇక్కడ మూడు షిప్టుల్లో వందల మంది కూలీలు పని చేస్తుంటారు. కూలీలు షిప్టు మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ నెల 1న ఈ ప్రమాదం జరిగింది.