నాగార్జున సాగర్: 20 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుండటంతో 20 గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1, 61, 380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం జలాశయానికి ఇన్ ఫ్లో 1, 68, 208 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2, 09, 708 క్యూసెక్కులు ఉంది. ఇక పూర్తిస్థాయి నీటిమట్టం 590. 00 అడుగులకుగాను 589. 60 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 0450 టీఎంసీలకుగాను 310. 8498 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్