సాగర్ జలశయానికి భారీగా పెరిగిన వరద

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరద ప్రవాహం భారీగా పెరగడంతో 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1, 74, 120 క్యూసెక్కులు ఉంది. ఇక జలాశయంలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. కాగా విద్యుత్ కాంతులతో సాగర్ సోయగాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్