చింతపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరై ఒక్కొక్కరికి 1,00,116 రూపాయల చొప్పున లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి వరంగా మారిందన్నారు. అలాగే దేశంలోనే ఈ పథకం ఆదర్శంగా నిలిచిందన్నారు.