పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పవర్లూమ్ కార్మికుల కూలి రేట్లు పెంచాలని కోరుతూ అక్టోబర్ 20 తర్వాత నిరవధిక సమ్మె చేస్తున్నామని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య తెలిపారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మ నగర్ లోని పవర్లూమ్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుపల్లి శ్రీనివాస్ ను కలిసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది.