దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) 388 పాయింట్లతో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ శుక్రవారం వెల్లడించింది. దీపావళి సందర్భంగా టపాసుల వినియోగంపై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోకుండా విచ్చలవిడిగా వాటిని కాల్చారు.