ఆర్మూర్: అరుణాచలం కి ప్రత్యేక బస్సులు

ఆర్మూర్ నుంచి అరుణాచలంకు ఈనెల 17న ప్రత్యేక బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ రవికుమార్ బుధవారం తెలిపారు. ఆర్మూర్ నుంచి అరుణాచలంకు వెళ్లి గిరి ప్రదక్షణ, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్, కాణిపాకం, జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం దర్శించుకుని 20న ఆర్మూర్ కు బస్సు చేరుకుంటుందన్నారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్