నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మంగళవారం నాడు భీమ్గల్ మండలం సహస్ర ఫంక్షన్ హాల్లో బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 224 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు టిఆర్ఎస్ పార్టీ సభ్యులు భారీగా పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడం బాధాకరమని అన్నారు.