నిజామాబాద్: ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సి మండల చైర్మన్ గా రాకేష్

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నవీపేట్ మండల చైర్మన్ గా రాకేష్ ను ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ చైర్మన్ డాక్టర్ సాప పండరి శుక్రవారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల, మానవ హక్కులతో పాటు భూ కబ్జాలు, బడుగు బలహీన వర్గాలకు విద్య ఉపాధి, సామాజిక న్యాయం కోసం కృషి చేసేందుకు చైర్మన్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు. అనంతరం నియామక పత్రం, ఐడి కార్డును అందజేశారు.

సంబంధిత పోస్ట్