పేలిన సిలిండర్.. ఐదుగురి పరిస్థితి విషమం

హైదరాబాద్‌ దోమలగూడలో అగ్నిప్రమాదం జరిగింది. రోజ్​ కాలనీలో స్థానికంగా నివాసం ఉంటున్న పద్మ ఇంట్లో సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్