సింధుతో పాటు బ్యాడ్మింటన్‌లో భారత్ మరో పతకంపై ఆశలు పెట్టుకుంది. దానికి కారణం పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి. సాత్విక్ ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరికి చెందినవాడు. అయితే చిరాగ్‌తో కలిసి సాత్విక్ ఈ సీజన్‌లో సంచలనాలు సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం, ఫ్రెంచ్, ఇండోనేసియా ఓపెన్ సిరీస్‌లను చిరాగ్‌తో కలిసి నెగ్గాడు. ఈ జోడీ వరల్డ్ నెంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా దక్కించుకున్నారు.